ఏపీలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు అంటే ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. నిత్యం చుట్టూ జనాలని వేసుకుని తిరుగుతూ, బాడీగార్డ్స్‌తో హడావిడిగా ఉంటారు. కానీ ఆ హడావిడి రాజకీయాలకు దూరంగా ఉంటూ, సైలెంట్‌గా తమ పని తాము చేసుకునే వెళ్ళే ఎమ్మెల్యేల్లో కృష్ణా జిల్లా తిరువూరు ఎమ్మెల్యే కొక్కిలిగడ్డ రక్షణనిధి ఒకరని చెప్పొచ్చు.