అధికార వైసీపీలో అంతర్గత కుమ్ములాటలు ఎక్కువగా జరుగుతున్న నియోజకవర్గం ఏదంటే నందికొట్కూరు అని ఠక్కున చెప్పేయొచ్చు. వైఎస్ సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీ చీఫ్ మార్షల్గా పనిచేసిన తొగురు ఆర్థర్ 2019 ఎన్నికల్లో వైసీపీ తరుపున ఎమ్మెల్యేగా బరిలోకి దిగి టీడీపీ అభ్యర్ధి బండి జయరాజుపై 40 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఆర్థర్ గెలుపుకు యువనాయకుడు బైరెడ్డి సిద్ధార్థ్ బాగానే కృషి చేశారు.