కృష్ణా జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేల్లో సైలెంట్‌గా పనిచేసుకుంటూ, ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండే ఎమ్మెల్యేల్లో కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఒకరు. 2019 ఎన్నికల్లో తొలిసారి ఎన్నికల్లో బరిలో దిగిన దూలం...దాదాపు 9 వేల ఓట్ల మెజారిటీతో టీడీపీ నేత జయమంగళ వెంకటరమణపై విజయం సాధించారు. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచిన నాగేశ్వరరావు నిత్యం ప్రజల మధ్యలోనే ఉంటున్నారు. వారికి అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాలు అందేలా చేస్తున్నారు.