గత ఎన్నికల్లో కృష్ణా జిల్లాలో టీడీపీ గెలిచింది కేవలం రెండు స్థానాల్లోనే. విజయవాడ తూర్పులో గద్దె రామ్మోహన్ గెలవగా, గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచారు. అయితే తర్వాత వంశీ వైసీపీ వైపుకు వచ్చేశారు. దీంతో గన్నవరంలో టీడీపీ అడ్రెస్ గల్లంతు అయింది. ఇటు దేవినేని అవినాష్‌ని వైసీపీలోకి తీసుకుని జగన్, విజయవాడ తూర్పు ఇన్చార్జ్ పదవి ఇచ్చారు. దీంతో గద్దెకు కష్టకాలం మొదలైంది.