కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి...తూర్పు గోదావరి జిల్లా వైసీపీలో దూకుడుగా ఉండే ఎమ్మెల్యే. రాజకీయ ప్రత్యర్ధులపైన విరుచుకుపడటంలో ముందుంటారు. మొన్న ఆ మధ్య చంద్రబాబు, పవన్ కల్యాణ్లని పరుష పదజాలంతో దూషించి బాగా హైలైట్ అయ్యారు. ఇలా వైసీపీలో దూకుడుగా ఉంటున్న ద్వారంపూడి ఎమ్మెల్యేగా పనిచేయడంలో బాగానే స్పీడుగా ఉంటున్నారు. రెండోసారి కాకినాడ సిటీ నుంచి గెలిచిన ద్వారంపూడి, ప్రజలకు అందుబాటులో ఉంటూ, వారి సమస్యలు పరిష్కరించడంలో ముందున్నారు.