వైఎస్సార్ మరణం తర్వాత జగన్ కాంగ్రెస్‌ని వీడి వైసీపీ పెట్టారనే సంగతి అందరికీ తెలిసిందే. ఇక జగన్ వైసీపీ పెట్టినప్పుడు కొంతమంది మాత్రమే తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేసి వైసీపీలోకి వచ్చారు. అలా జగన్ వెంట నడిచిన వారిలో తెల్లం బాలరాజు కూడా ఒకరు. వైఎస్సార్‌కు అభిమాని అయిన బాలరాజు 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ తరుపున పోలవరం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.