గత ఎన్నికల్లో జనసేన విడిగా పోటీ చేయడం వల్ల ఓట్లు చీలిపోయి టీడీపీకి డ్యామేజ్ జరిగి, వైసీపీ గెలిచిన నియోజకవర్గాలు చాలానే ఉన్నాయి. అలా జనసేన ఓట్లు చీల్చడం వల్ల వైసీపీ గెలిచిన నియోజకవర్గాల్లో తూర్పు గోదావరి పి.గన్నవరం నియోజకవర్గం ఒకటి. గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుంచి కొండేటి చిట్టిబాబు పోటీ చేశారు. అటు టీడీపీ నుంచి నేలపూడి స్టాలిన్ బాబు, జనసేన నుంచి పాముల రాజేశ్వరి దేవి పోటీ చేశారు.