వైసీపీ అధికారంలోకి వచ్చాక టీడీపీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు అనూహ్యంగా జగన్కు మద్దతు తెలిపిన విషయం తెలిసిందే. అయితే వైసీపీ కండువా కప్పుకోకుండా వారు జగన్కు మద్ధతు తెలిపి అనధికారికంగా వైసీపీ ఎమ్మెల్యేలుగా నడుస్తున్నారు. అంటే తమ పార్టీలోకి వచ్చేవారు పదవులకు రాజీనామా చేసి రావాలని జగన్ రూల్ పెట్టడంతో నలుగురు టీడీపీ ఎమ్మెల్యేలు తెలివిగా, టీడీపీని వీడి, వైసీపీలో చేరకుండా, ప్రభుత్వానికి మద్ధతు ఇచ్చారు.