గత ఎన్నికల్లో టీడీపీ తరుపున గెలిచిన ఎమ్మెల్యేల్లో నలుగురు వైసీపీ వైపుకు వెళ్ళిన విషయం తెలిసిందే. డైరక్ట్‌గా వైసీపీ కండువా కప్పుకోకుండా, తమ పదవులకు రాజీనామా చేయకుండా, జగన్ ప్రభుత్వానికి మద్ధతు తెలిపారు. అంటే ఆ నలుగురు ఎమ్మెల్యేలు అనధికారికంగా వైసీపీకి చెందినవారే. అలా వైసీపీ వైపుకు వెళ్ళిన ఎమ్మెల్యేల్లో మద్దాలి గిరి కూడా ఒకరు.