నెల్లూరు జిల్లాలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో కావలి ఒకటి. గత రెండు పర్యాయాల నుంచి ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూనే వస్తుంది. అయితే ఇక్కడ టీడీపీకి పెద్దగా పట్టు లేదనే చెప్పొచ్చు. ఇక్కడ టీడీపీ కేవలం మూడుసార్లు మాత్రమే గెలిచింది. ఇంకా ఎక్కువసార్లు కాంగ్రెస్ గెలవగా, ఆ తర్వాత నుంచి నియోజకవర్గం వైసీపీకి కంచుకోటగా మారింది.