కృష్ణా జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి అనుకూలమైన జిల్లా. ఈ జిల్లాలో పలు నియోజకవర్గాలు టీడీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే 2019 ఎన్నికల్లో ఆ కంచుకోటలు బద్దలయ్యాయి. జగన్ వేవ్‌లో ఈ జిల్లాలో వైసీపీ సత్తా చాటింది. ఈ క్రమంలోనే టీడీపీకి కంచుకోటగా ఉన్న నందిగామ నియోజకవర్గంలో వైసీపీ జెండా ఎగిరింది. టీడీపీ పెట్టాక ఇక్కడ జరిగిన ఎన్నికల్లో మెజారిటీ సార్లు పసుపు జెండానే ఎగిరింది. 8సార్లు టీడీపీ గెలవగా, ఒకసారి కాంగ్రెస్ గెలిచింది.