గత ఎన్నికల్లో విజయనగరం జిల్లాలో వైసీపీ క్లీన్‌స్వీప్ చేసి, 9కి 9 సీట్లు గెలుచుకున్న విషయం తెలిసిందే. అన్నిచోట్ల వైసీపీ మంచి మెజారిటీలతో గెలిచింది. అలా వైసీపీ తరుపున మంచి మెజారిటీతో గెలిచినవారిలో బద్దుకొండ అప్పలనాయుడు కూడా ఒకరు. మంత్రి బొత్స సత్యనారాయణ బంధువైన అప్పలనాయుడు 2009 ఎన్నికల్లో నెల్లిమర్ల నుంచి కాంగ్రెస్ తరుపున పోటీ చేసి స్వల్ప మెజారిటీ తేడాతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.