ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటేయగా, ఈ రెండేళ్లలో మంచి పని కనబర్చిన ఎమ్మెల్యేలు మళ్ళీ వచ్చే ఎన్నికల్లో గెలవడం పక్కా అని అర్ధమవుతుంది. అలా వచ్చే ఎన్నికల్లో కూడా గెలిచే సత్తా ఉన్న ఎమ్మెల్యేల్లో శిల్పా చక్రపాణి రెడ్డి ముందు వరుసలో ఉంటారు. కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యేగా ఉన్న చక్రపాణి రెడ్డికి, ఆ నియోజకవర్గంలో తిరుగులేకుండా పోయిందనే చెప్పొచ్చు.