ఏపీ రాజకీయాల్లో సీనియర్ నాయకుడుగా ఉన్న మాజీ మంత్రి, ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే ఆనం రాం నారాయణరెడ్డి పూర్తిగా సైలెంట్ అయిపోయినట్లు కనిపిస్తోంది. దశాబ్దాల పాటు రాజకీయాలు చేసిన ఆనం ఇప్పుడు నియోజకవర్గానికే పరిమితమయ్యారు. మొదట తెలుగుదేశంలో రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి, ఆ తర్వాత కాంగ్రెస్లో కీలక నేతగా ఎదిగి, ఉమ్మడి ఏపీకి మంత్రిగా సేవలు చేసిన ఆనం, మళ్ళీ టీడీపీలోకి వచ్చి రాజకీయాలు చేశారు. ఇక 2019 ఎన్నికల ముందు వైసీపీలోకి వెళ్ళి, వెంకటగిరి వైసీపీ టికెట్ దక్కించుకుని భారీ మెజారిటీతో గెలిచారు.