కర్నూలు జిల్లాలో వైసీపీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో నందికొట్కూరు కూడా ఒకటి. గత రెండు పర్యాయాలుగా ఇక్కడ వైసీపీదే విజయం. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో యువనేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హవా ఎక్కువగా ఉంటుంది. ఆ నియోజకవర్గ సమన్వయ కర్తగా ఉన్న బైరెడ్డి దూకుడుగా రాజకీయాలు చేస్తున్నారు. ఎస్సీ రిజర్వడ్ నియోజకవర్గం కావడంతో గత ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ తరుపున ఆర్థర్ బరిలో నిలబడ్డారు. జగన్ వేవ్‌లో, బైరెడ్డి సపోర్ట్‌తో ఆర్థర్ భారీ మెజారిటీతో గెలిచి ఎమ్మెల్యే అయ్యారు.