అధికార వైసీపీలో దూకుడుగా పనిచేసే యువ ఎమ్మెల్యేలకు కొదవ లేదనే చెప్పొచ్చు. చిన్న వయసులోనే ఎమ్మెల్యేలుగా గెలిచి, తక్కువ సమయంలోనే ప్రజల్లో మంచి ఫాలోయింగ్ తెచ్చుకున్న నాయకుల్లో జక్కంపూడి రాజా కూడా ఒకరు. రాజా తండ్రి జక్కంపూడి రామ్మోహన్ రావు గురించి తూర్పు గోదావరి ప్రజలకు పెద్దగా పరిచయం అక్కరలేదు. దశాబ్దాల పాటు జక్కంపూడి కాంగ్రెస్లో పనిచేశారు. గతంలో వైఎస్సార్ క్యాబినెట్లో కూడా పనిచేశారు.