కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం....మొన్నటివరకు కాంగ్రెస్కు కంచుకోట కాగా, గత రెండు ఎన్నికల నుంచి వైసీపీకి కంచుకోటగా మారింది. అయితే పార్టీల పరంగా కాకుండా చెబితే పాణ్యం...కాటసాని రామ్ భూపాల్ రెడ్డి కంచుకోట అని చెప్పొచ్చు. ఎందుకంటే 1985, 1989, 1994, 2004, 2009 ఎన్నికల్లో పాణ్యం నుంచి కాటసాని కాంగ్రెస్ తరుపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఇక 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్ధిగా నిలబడి దాదాపు 60 వేల పైనే ఓట్లు తెచ్చుకుని, రెండోస్థానంలో నిలిచారు.