గుంటూరు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉన్న నియోజకవర్గాల్లో వేమూరు కూడా ఒకటి. మొదట నుంచి ఇక్కడ టీడీపీకి అనుకూల ఫలితాలే వచ్చాయి. 1983 నుంచి 2019 వరకు జరిగిన ఎన్నికల్లో టీడీపీ, వేమూరులో ఆరు సార్లు విజయం సాధించింది. ఇక కాంగ్రెస్ రెండుసార్లు గెలవగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ తొలిసారి వైసీపీ విజయం సాధించింది.