గత ఎన్నికల్లో కేవలం జగన్ ఇమేజ్‌తో గెలిచిన ఎమ్మెల్యేల్లో...కర్నూలు జిల్లా కోడుమూరు ఎమ్మెల్యే జరదొడ్డి సుధాకర్ కూడా ఒకరు. 2014 ఎన్నికల్లో కోడుమూరులో వైసీపీ తరుపున మణిగాంధీ ఎమ్మెల్యేగా గెలిచి తర్వాత టీడీపీలోకి వెళ్లారు. దీంతో జగన్, సుధాకర్‌కు కోడుమూరు వైసీపీ బాధ్యతలు అప్పగించారు. మళ్ళీ మణిగాంధీ వైసీపీలోకి తిరిగొచ్చిన జగన్ మాత్రం సుధాకర్‌కే టికెట్ ఇచ్చారు. దీంతో జగన్ వేవ్‌లో సుధాకర్ దాదాపు 36 వేల ఓట్ల పైనే మెజారిటీతో గెలిచారు.