గుంటూరు జిల్లాలో అధికార వైసీపీకి అనుకూలమైన నియోజకవర్గాల్లో గుంటూరు ఈస్ట్ ఒకటి. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన ఈ గుంటూరు ఈస్ట్‌లో వైసీపీ రెండుసార్లు గెలిచింది. 2009 ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్ గెలిచింది. ముస్లిం ఓటర్లు అధికంగా ఉన్న ఈ నియోజకవర్గంలో ముస్లిం అభ్యర్ధులే పోటీ చేస్తూ వస్తున్నారు.