గత ఎన్నికల్లో టిడిపి తరఫున గెలిచిన 23 మంది ఎమ్మెల్యేల్లో నలుగురు ఎమ్మెల్యేలు వైసీపీ వైపుకు వెళ్లిన విషయం తెలిసిందే. ఇక అలా వైసీపీలోకి వెళ్లిన వారిలో వాసుపల్లి గణేష్ కూడా ఒకరు. గణేష్ టిడిపి తరఫున 2009 ఎన్నికల్లో విశాఖ సౌత్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. 2014లో అదే సౌత్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి టిడిపి తరఫున విజయం సాధించారు. ఐదేళ్ల పాటు టిడిపి ఎమ్మెల్యేగా సౌత్‌లో మంచిగా అభివృద్ధి కార్యక్రమాలు చేశారు. అలాగే పార్టీ బలోపేతానికి కృషి చేశారు.