నెల్లూరు రూరల్ నియోజకవర్గం...అధికార వైసీపీకి కంచుకోట. గత రెండు పర్యాయాలు ఇక్కడ వైసీపీ జెండా ఎగురుతూ వస్తుంది. వైసీపీ తరుపున కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విజయం సాధిస్తున్నారు. 2014 2019 ఎన్నికల్లో వరుసగా గెలిచిన కోటంరెడ్డికి నెల్లూరు రూరల్లో తిరుగులేదనే చెప్పొచ్చు. ఈయనకు నియోజకవర్గంలో మంచి ఫాలోయింగ్ ఉంది. పైగా అధికారంలో ఉండటంతో కోటంరెడ్డి... సాధ్యమైన మేర పనులు చేసుకుంటూ వెళుతున్నారు.