త్వరలోనే ఏపీలో మంత్రివర్గంలో మార్పులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ సారి జగన్ మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేయాలని చాలామంది ఎమ్మెల్యేలు చూస్తున్నారు. ముఖ్యంగా సీనియర్ ఎమ్మెల్యేలు ఈ సారి తమకు ఛాన్స్ దక్కకపోదా అని ఎదురు చూస్తున్నారు. అలా మంత్రి పదవి కోసం ఎదురు చూసే వాళ్ళలో సీనియర్ ఎమ్మెల్యే గొల్ల బాబూరావు కూడా ఒకరు. 2009 ఎన్నికల్లో పాయకరావుపేట నుంచి కాంగ్రెస్ తరుపున విజయం సాధించిన గొల్ల బాబూరావు...ఆ తర్వాత వైఎస్సార్ మరణంతో కాంగ్రెస్కు, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మరీ జగన్ వెంట నడిచారు.