అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట అని అందరికీ తెలిసిందే. ఈ జిల్లాలో టిడిపికి తిరుగులేని బలం ఉంది...ప్రతి ఎన్నికల్లోనూ ఇక్కడ టిడిపికి మంచి ఫలితాలే వచ్చేవి. అంతలా టిడిపికి అనంత జిల్లా కలిసొస్తుంది. కాకపోతే అనంతపురం జిల్లాలో టిడిపికి అసలు కలిసిరాని నియోజకవర్గం కూడా ఒకటి ఉంది. అదే అనంతపురం అసెంబ్లీ స్థానం...ఈ స్థానంలో టిడిపికి పెద్ద విజయాలు దక్కలేదు.