ఏపీలో ఉన్న ఏజెన్సీ ప్రాంతాల్లో టిడిపికి పెద్ద పట్టు ఉండదనే చెప్పొచ్చు. ఏజెన్సీ నియోజకవర్గాల్లో టిడిపికి పెద్దగా విజయాలు కూడా దక్కడం కష్టమే. గత ఎన్నికల్లో ఏజెన్సీ నియోజకవర్గాల్లో టిడిపి ఘోరంగా ఓడిపోయింది. ఇదే క్రమంలో తూర్పు గోదావరి జిల్లాలో ఉన్న రంపచోడవరంలో కూడా టిడిపి ఓటమి పాలైంది. 2008 నియోజకవర్గాల పునర్విభజనలో భాగంగా ఏర్పడిన రంపచోడవరంలో టిడిపి ఇంతవరకు గెలవలేదు.