గత ఎన్నికల్లో సంచలన విజయాలు నమోదైన నియోజకవర్గాల్లో రాప్తాడు కూడా ఒకటి. రాప్తాడు అంటే పరిటాల ఫ్యామిలీ అడ్డా..ఇక్కడ ఆ ఫ్యామిలీకి తిరుగులేదు. అయితే 2019 ఎన్నికల్లో ఊహించని పరిణామం ఎదురైంది. తొలిసారి పరిటాల వారసుడు శ్రీరామ్ ఎన్నికల బరిలో దిగారు. అటు వైసీపీ నుంచి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పోటీలోకి దిగారు. జగన్ వేవ్‌లో శ్రీరామ్‌కు ఊహించని ఓటమి ఎదురైంది. తొలిసారి తోపుదుర్తి, పరిటాల ఫ్యామిలీకి చెక్ పెట్టి ఎమ్మెల్యేగా గెలిచారు.