బిన్నీ బన్సల్, సచిన్ బన్సల్ ఇద్దరూ ఐ ఐ టీ ఢిల్లీ లో కలిశారు. ఇంజినీరింగ్ పూర్తయ్యాక ఐటీ రాజధాని అయిన బెంగళూరులో కలిశారు. సచిన్ మాత్రం అమెజాన్ లో చేరాడు. కానీ బిన్నీ బన్సల్ గూగుల్లో ఉద్యోగానికి రెండుసార్లు దరఖాస్తు చేసి, ఫెయిల్ అయ్యాడు. ఇక చివరకు తాను కూడా చేసేదేమీ లేక అమెజాన్ లోనే చేరాడు. కొన్నాళ్లు పనిచేశాక ఆ కంపెనీలో ఉన్న మెలుకువలను అన్నీ తెలుసుకొని, ఇద్దరూ కలసి ఒకటే అనుకున్నారు . తాము పనిచేస్తున్న అమెజాన్ స్థాయిలో దేశీ ఈ - కామర్స్ కంపెనీలు ఏవీ సేవలు అందించడం లేదు. అంతే.. సేవింగ్స్ గా దాచుకున్న రెండు లక్షల రూపాయలు పెట్టి, తమ ఫ్లాట్లోనే 2007లో ఫ్లిప్ కార్ట్ ను ఆరంభించారు.మొదటగా పుస్తకాలు విక్రయించే వారిని లిఫ్ట్ చేసి, అమెజాన్ మాదిరే ఆరంభంలో వారు కూడా ఆన్లైన్లో పుస్తకాలను విక్రయించారు. దాదాపు ఒకటిన్నర సంవత్సరం పాటు వారి తల్లిదండ్రులు పది వేల రూపాయల చొప్పున ఇరువురికి ఆదుకున్నారు. తర్వాత పుస్తకాల నుంచి వస్తువులు అమ్మే సెల్లర్లను తమ సైట్లో లిస్ట్ చేయడం మొదలుపెట్టారు. ఇక అమెజాన్ కు పోటీగా దేశీ ఈ-కామర్స్ సంస్థ ఒకటి రూపుదిద్దుకుంటున్న సమయంలో.. ఈ విషయాన్ని తెలుసుకుని విదేశీ ఇన్వెస్టర్లు ముందుకొచ్చారు. ఒక వరుసగా ఇన్వెస్ట్ చేయడం ఆరంభించారు.. ఇక వీరికి కాలం కలిసి వచ్చింది. ఇద్దరు బిలియనీర్లు అయ్యారు.. ఇక ఈ మధ్యనే ఫ్లిప్ కార్ట్ ను రూ.1.4 లక్షల కోట్ల విలువ తో అమెరికన్ దిగ్గజం వాల్మార్ట్ సొంతం చేసుకుంది..