వేక్ ఫిట్ బ్యాచ్ 2021 - 2022 స్లీప్ ఇంటర్న్షిప్ మీకోసమే తీసుకొచ్చింది. అయితే ఇందులో మీరు చేయవలసిందల్లా రోజుకు 9 గంటలు నిద్ర పోవాలి. 100 రోజులు అలా చేయగలిగితే మీకు అక్షరాలా పది లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి. మీరు ఎప్పుడైనా నిద్రపోతూ డబ్బులు సంపాదించి పెడితే బాగుంటుంది అని అనుకునే వాళ్ళకి ఇది ఒక చక్కటి అవకాశం. అయితే ఇంటర్న్షిప్ లో పాల్గొనేవారు ఎలాంటి ఆటంకం లేకుండా హాయిగా రోజుకు తొమ్మిది గంటల సేపు నిద్ర పోవాలి అంతే. ఇంటర్న్షిప్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో, ఎవరైతే బాగా నిద్ర పోతారో, వారిలో కొంతమందిని మాత్రమే ఎంపిక చేసుకొని 100 రోజులపాటు ఇంటర్న్షిప్ కు అర్హత కల్పిస్తారు. ఇందులో ఎంపికైన వారందరికీ లక్ష రూపాయల చొప్పున లభిస్తాయి. అయితే గెలిచిన వారికి మాత్రం ఏకంగా పది లక్షల రూపాయలు వస్తాయి.https://wakefit.co/sleepintern వెబ్సైట్ను సందర్శించి డీటైల్స్ ఫిల్ చేయండి.