ఒడిశాలోని కలహందిలో బిభు సాహు అని ఒక ఉపాధ్యాయుడు, 2007లో తన చేసే ఉద్యోగాన్ని మానేశారు. ఆ తర్వాత అగ్రి బిజినెస్‌లోకి అడుగులు వేశారు. దీంతో మెల్లగా రైస్ మిల్లు వ్యాపారంలోకి ప్రవేశించాడు. రైస్ మిల్లు వ్యాపారంతో ప్రతి సంవత్సరం దాదాపు 3 టన్నుల వరకు వరి పొట్టు వచ్చేది.ఈ వరి పొట్టు ను చిన్న చిన్న గుళికలు, గుండ్లు లాగా తయారు చేశారు. ఇక వాటిని సాహూ విదేశాల్లోని కొన్ని కంపెనీలకు మెయిల్ చేశాడు. 2019 లో తొలి లోడు ను సౌదీ అరేబియాకు పంపించాడు. ఇక అదే సంవత్సరంలోనే వంద టన్నుల గుళికలని అమ్మి, ఏకంగా ఎవరూ ఊహించని విధంగా రూ.20 లక్షలు సంపాదించారు. ప్రస్తుతం అదే పద్ధతిని పాటిస్తూ, ప్రతి సంవత్సరం కొన్ని లక్షల రూపాయలను సంపాదిస్తున్నాడు సాహూ..