నెల్లూరు జిల్లా కి బుచ్చిరెడ్డిపాలెం లో ఎస్. కే. జిలాని అని చిరువ్యాపారి ఈ సాహసం చేశాడు. ముంబై జాతీయ రహదారికి ఆనుకొని బస్టాండ్ సెంటర్ సమీపంలో షాపింగ్ కాంప్లెక్స్ వద్ద ఒకే చోట నుంచి 40 ఏళ్లుగా ఆయన తోపుడు బండిపై జీవిస్తున్నారు. అయితే ఇటీవల అక్కడ పాత షాపులు పడగొట్టి, కొత్తగా వాణిజ్య సముదాయం నిర్మించాలని నిర్వాహకులు నిర్ణయించారు.బుధవారం జరిగిన వేలంలో ఆయన కూడా పాల్గొన్నాడు.108 చదరపు అడుగుల స్థలాన్ని రూ.1.20 కోట్లకు సొంతం చేసుకున్నాడు. ఈ విషయం తెలిసిన ఇరుగుపొరుగు వారు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు