కేంద్ర ప్రభుత్వం ఎన్నో రకాల స్కీమ్స్ ను అందిస్తోంది. అయితే వీటిలో ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ ధన్ యోజన కూడా ఒకటి.దీనికోసం ఒక ఆధార్ కార్డ్ జన్ ధన్ అకౌంట్ ఉంటే సరిపోతుంది. పాస్ పోర్ట్ సైజు ఫోటోలు కూడా అవసరం అవుతాయి. అలాగే నామిని కూడా తప్పనిసరి. మీరు ఈ స్కీమ్‌లో చేరిన తర్వాత మీకు శ్రమ్ యోగి కార్డు ఇస్తారు. ఇలా చేరిన తరువాత మీకు ప్రతి నెల రూ.3000 వస్తాయి. అయితే దీనికి వయోపరిమితి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే ఇందుకోసం నెలకు యాభై ఐదు రూపాయల నుంచి 200 రూపాయలు కట్టాలి. మీ వయసు ప్రాతిపదికన బట్టి మీకు వచ్చే పెన్షన్ డబ్బులు మారుతూ ఉంటాయి. ఇక ఈ పథకంలో చేరిన వారికి 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెల డబ్బులు వస్తాయి.