జనవరి నుంచి జూన్ 2021 వరకు మూడు రకాల డీఏ లను ప్రభుత్వ ఉద్యోగులు తిరిగి పొందవచ్చు. వాటిని సీ జీ ఎస్ సాలరీ కి కలుపుతారు. ఇక ఫలితంగా నెలవారి పీఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెరుగుతుంది. అంటే దీర్ఘకాలం లోని పీఎఫ్ బ్యాలెన్స్ పెరుగుతుంది..జనవరి నుంచి జూన్ 2020వరకు మూడు శాతం, జూలై నుంచి డిసెంబర్ 2020 వరకు మూడు శాతం అని భావించవచ్చు. అంటే మొత్తం 11 శాతం డీ ఏ లభిస్తుంది. ఇక డీ ఏ ను కనుక చెప్పినట్లు ఇస్తే..ఇది ఇప్పుడున్న 17 శాతం నుంచి 28 శాతానికి పెరుగుతుంది.ఇప్పుడు ఈ డీ ఏ 17 శాతం నుంచి 28 శాతానికి పెంచినట్లు అయితే, పీ ఎఫ్ కాంట్రిబ్యూషన్ కూడా పెంచి నట్లే.. అందువల్ల ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల నెలవారి జీతంలో కూడా మార్పులను తీసుకొస్తుంది