దిగ్గజ బైక్ తయారీ సంస్థ కవాసకి ఇండియా తన బైక్ మోడళ్ల పై ఆఫర్లను ప్రకటించింది.అయితే ఈ బైక్ లపై తగ్గింపు ఆఫర్లు కూడా ఏప్రిల్ 30 వ తేదీ వరకు గడువు విధించింది. వల్కన్ ఎస్ మోడల్ పై రూ.20 వేలు, వెర్సీస్ 650 బైక్ పై రూ. 30 వేలు, నింజా 1000 ఎస్ ఎక్స్ బైక్ పై రూ. 30 వేలు, డబ్ల్యూ 800 మోడల్ పై రూ. 30 వేలు రూపాయల వరకు తగ్గింపు లభిస్తోంది. ఇక వీటితో మాత్రమే కాకుండా ఇతర కొత్త బైక్‌ల పై కూడా ఆఫర్లు ఉన్నాయి. అంటే అప్లోడ్ వర్షన్ అయిన బైక్ ల పై కూడా డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది... అంటే కే ఎల్ ఎక్స్ 110 మోడల్‌పై రూ. 30 వేల వరకు తగ్గింపు లభిస్తోంది. అలాగే కే ఎల్ ఎక్స్ 140 మోడల్ పైరూ. 40 వేల వరకు డిస్కౌంట్ అలాగే కే ఎక్స్ 100 మోడల్ పై రూ. 50 వేల వరకు తగ్గింపు ఉంది..