త్రిషా రెడ్డి..ఈమె వయసు 17 సంవత్సరాలు. చదువుతున్నది ఇంటర్ సెకండియర్. తెలంగాణలోని హైదరాబాద్ కు చెందినది..త్రిష బ్రాండెడ్ సెకండ్ హ్యాండ్ దుస్తులకు రంగులద్ది, వాటిని ఆన్లైన్ ద్వారా విక్రయించి, డబ్బులు ఆర్జిస్తోంది. తెలంగాణలో స్టార్టప్‌ల క్రేజ్‌ను చూసి,ఆమె ఎప్పటి నుంచో స్టార్టప్ ప్రారంభించాలని భావించింది. అయితే, ఈ కరోనా సెలవుల్లో ఆమె తన ఆలోచనలను కార్యరూపం దాల్చేలా చేసింది. " త్రిఫ్ట్ స్టోర్ " పేరిట ఆన్లైన్లో వ్యాపారం ప్రారంభించి, నెల రోజుల్లో రూ.70 వేలు సంపాదించింది. అది కూడ కేవలం సోషల్ మీడియాతోనే..! ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, వాట్సప్ తదితర సోషల్ మీడియాలను వినియోగించుకుంది.