గ్రామ్ సుమంగళ్ రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్. మనీ బ్యాక్ తో పాటు ఇన్సూరెన్స్ లను కూడా పొందే స్కీమ్ ఇది. ముఖ్యంగా గ్రామీణ ప్రజలకు చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులో రోజుకు 95 రూపాయలు పెట్టుబడిగా పెడితే, స్కీమ్ ముగిసేసరికి మీ చేతికి 14 లక్షల రూపాయలు వస్తాయి. గ్రామ్ సుమంగళీ యోజన స్కీమ్ బీమా పాలసీ కింద రూ. పది లక్షల వరకు అందుకోవచ్చు. మెచ్యూరిటీ తరువాత జీవించి ఉంటే పాలసీదారుకు మనీ బ్యాక్ ప్రయోజనం కూడా ఉంది. అనుకోని పరిస్థితులలో పాలసీదారుడు మరణిస్తే, నామినీకి మెచ్యూరిటీ అనంతరం అష్యూర్డ్ మొత్తం తో పాటు బోనస్ కూడా లభిస్తుంది.. ఇక ఇందులో ప్రతిరోజు 95 రూపాయలు, ఈ స్కీమ్ ముగిసేసరికి చేతికి రూ.13.72 లక్షల మేర లబ్ధి చేకూరుతుంది.