బ్రిటన్ లోని రెండవ తరం రాజకుటుంబానికి చెందిన తొలి కంట్రీ క్లబ్ గా పేరుప్రఖ్యాతులు పొందింది . దీని పేరు స్టోక్ పార్క్.. ఇటీవల ఈ కంట్రీ క్లబ్ ను వేలంపాటలో నిర్వహించగా , పారిశ్రామిక దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ దిగ్గజ అధినేత అయిన ముకేశ్ అంబానీ సారథ్యంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఈ కంట్రీ క్లబ్ ను సొంతం చేసుకుంది. ఇంటర్నేషనల్ గ్రూప్ కి చెందిన ప్రతిష్టాత్మక కంట్రీ క్లబ్ గోల్ఫ్ రిసార్ట్ అయిన స్టోక్ పార్క్ ను 57 మిలియన్ పౌండ్ల కు కొనుగోలు చేసింది. అంటే మన ఇండియన్ కరెన్సీ ప్రకారం దాదాపుగా 592 కోట్ల రూపాయలు అన్నమాట..