మీకు 20 సంవత్సరాలు ఉన్నాయని అనుకుంటే, అలా మీరు 40 సంవత్సరాలు అంటే మీకు 60 సంవత్సరాల వయసు వచ్చే వరకు ప్రతి నెల ఎన్ పీఎస్ అకౌంట్లో రూ.1590 రూపాయలు ఇన్వెస్ట్ చేయాలి. ఇలా చేస్తే మీకు రూ.కోటికి పైగా వస్తాయి. ఎవరైనాసరే 60 ఏళ్లు వయసు వచ్చే వరకు డబ్బులు కడుతూనే రావాలి. 18 ఏళ్లు వయసు కలిగిన వారు ఎవరైనాసరే ఎన్పీఎస్ స్కీమ్‌లో చేరవచ్చు. 60 ఏళ్లలోపు వయసు కలిగిన వారు చేరవచ్చు.కనీసం రూ.500తో కూడా ఎన్పీఎస్ ఖాతా తెరవచ్చు. అయితే ఇందుకోసం మీకు బ్యాంక్ అకౌంట్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ ఐడీ వంటివి ఖచ్చింతంగా అవసరం అవుతాయి..