ఎల్ ఐ సి జీవన్ బెనిఫిట్ పాలసీ మీరు 30 సంవత్సరాల వయసులో ఎల్ఐసి యొక్క లైఫ్ బెనిఫిట్ పాలసీ తీసుకుంటే,మొత్తం రెండు లక్షలకు కొనుగోలు చేసుకోవచ్చు. ఈ పాలసీ యొక్క కాలవ్యవధి 25 సంవత్సరాలుగా ఉంటుంది. ఇక ఇందుకోసం మీరు ప్రతినెల 800 రూపాయలు ప్రీమియం చెల్లించాలి. ఈ మొత్తం పెట్టుబడి 1.5 లక్షల రూపాయలు. ఇక మీకు 1000 రూపాయలకు గాను 47 రూపాయల చొప్పున బోనస్ లభిస్తుంది. ఇక మీ మొత్తం బోనస్ 25 సంవత్సరాలలో 2.35 లక్షలు. ఇక అలాగే పరిపక్వత పై మీకు 90 వేల రూపాయలు అదనపు బోనస్ లభిస్తుంది ఇక చివరిగా మీరు మొత్తం 5.25 లక్షల రూపాయలను పొందవచ్చు..