మ్యూచువల్ ఫండ్ క్యాలిక్యులేటర్ ప్రకారం మీరు నెలకు వెయ్యి రూపాయలు చొప్పున మీ అకౌంట్ లో పెడితే, 20 ఏళ్ళ తర్వాత మీకు రూ.20 లక్షలు లభిస్తాయి. ఇక్కడ పన్నెండు శాతం రాబడిని పరిగణలోకి తీసుకుంటారు. అదే నెలకు రూ.500 పెడితే ఇరవై ఏళ్ళలో రూ.5 లక్షలు వస్తాయి. అదే నెలకు 500 రూపాయల చొప్పున కడుతూ ఉంటే, అలా 30 ఏళ్ళు పెడితే రూ.15.5 లక్షలు వస్తాయి. మీరు కట్టే అమౌంట్ పెరిగేకొద్దీ మీకు వచ్చే డబ్బులు కూడా పెరుగుతాయి. అదే మీరు రూ.50 లక్షలు పొందాలని భావిస్తే, నెలకు 1500 రూపాయల చొప్పున ఇన్వెస్ట్ చేస్తే సరిపోతుంది. అంటే రోజుకు యాభై రూపాయలు చొప్పున ఆదా చేస్తూ నెలకు రూ.1500 కడితే 30 సంవత్సరాల లోపు మీకు 50 లక్షల రూపాయలు మీ సొంతమవుతాయి.