మీలో ఎవరైనా ఇంటర్ నెట్ బ్యాంకింగ్ చేస్తూ ఉంటే కచ్చితంగా ఈ జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే సైబర్ నేరగాళ్లు ఈజీగా మీ ఖాతాలోఉండే డబ్బును హ్యాక్ చేసే అవకాశం ఎక్కువ. అందుకే సైబర్ నేరగాళ్లకు చిక్కకుండా ఉండాలంటే, ఇప్పుడు చెప్పబోయే కొన్ని జాగ్రత్తలు పాటిస్తే సరిపోతుంది. అలాగే బ్యాంకుల నుంచి ఫోన్ చేస్తున్నాము అని చెప్పి, ఎవరైనా మీ ఖాతా డెబిట్ కార్డుల వివరాలు అడిగితే అసలు చెప్పకండి. ఒకవేళ మీకు అనుమానం వస్తే వెంటనే పోలీసు అధికారులతో పాటు బ్యాంకు అధికారులు కూడా సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది.ఇక మనం ప్రతి రోజూ ఉపయోగించే రెగ్యులర్ ఈ-మెయిల్స్ అలాగే ఫోన్ నెంబర్లను మాత్రమే బ్యాంకు ఖాతాలకు లింక్ చేయాలి.లేకపోతే బ్యాంకు నుంచి వచ్చే హైసెక్యూరిటీ అలర్ట్స్ ను, అలాగే ఇతర సమాచారాన్ని పొందే అవకాశం ఉండదు.