నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్ స్కీం కింద రూ.100 నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. నిర్ణీత కాలం వరకు ఇన్వెస్ట్ చేస్తూ పోతే , ఈ స్కీమ్ ముగిసేసరికి మిలియనీర్ కూడా అవ్వచ్చు. ఇందులో ఎలాంటి రిస్క్ ఉండదు. డబ్బుకు తగిన రాబడి కూడా కచ్చితంగా వస్తుంది. ఇక దీని మెచ్యూరిటీ కాలం ఐదు సంవత్సరాలు. ఒకవేళ అవసరం అనుకుంటే మీరు ఏడాది తర్వాత కూడా డబ్బులు విత్డ్రా చేసుకోవచ్చు..ప్రస్తుతం ఈ స్కీమ్ పై 6.8 శాతం వడ్డీ వస్తుంది.. ఇక అంతే కాకుండా మీరు ఈ స్కీమ్ లో డబ్బులు పెడితే, ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్ 80సి కింద రూ. 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందవచ్చు.ప్రతి ఆరు నెలలకు ఒకసారి డబ్బులు మీ అకౌంట్ కు చేర్చబడతాయి..