విజయవాడ జిల్లాలోని కొవిడ్ కేర్ కేంద్రాల్లో మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వైద్యులు అందుబాటులో ఉన్నారని కలెక్టర్ ఇంతియాజ్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు..కొవిడ్ లక్షణాలను బట్టి వైద్య నివేదికల ఆధారంగా చికిత్స అందించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలో మొత్తం ఏడు కొవిడ్ కేర్ కేంద్రాల ద్వారా వ్యక్తులకు చికిత్స అందించనున్నట్లు వివరించారు.. అంతే కాకుండా ఏ వ్యక్తి కూడా ఆక్సిజన్ అందక చనిపోకూడదని, అందరికీ ఆక్సిజన్ అందేలా,ఆక్సిజన్ కొరత లేకుండా చర్యలు చేపడుతున్నట్లు కలెక్టర్ తెలిపారు.. ఇక అంతే కాకుండా మెరుగైన వైద్య సేవలను అందించడం తో, కరోనా బాధితులు ఆసుపత్రిలోనే చికిత్స పొందేందుకు ఆసక్తి చూపుతున్నట్లు ఆయన తెలిపారు..కరోనా బారిన పడి కోలుకున్న వ్యక్తులను షార్ట్ లిస్ట్ చేసి, అందులో లక్కీ డిప్ ద్వారా ముగ్గురిని ఎంపిక చేసి, ప్రతి సోమవారం ప్రకటిస్తామని ఆయన పేర్కొన్నారు.. ఇక విజేతలకు రూ.15,000, రూ.10,000, రూ.ఐదు వేల చొప్పున నగదు పురస్కారాలు కూడా అందిస్తామని వెల్లడించారు