కర్ణాటకకు చెందిన కిషోర్ ఇందుకూరి అనే వ్యక్తి, ఐఐటి ఖరగ్ పూర్ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇక అమెరికాలోని ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో మాస్టర్స్ , పీహెచ్డీ పూర్తి చేశాడు. ఆ తర్వాత ఇంటెల్ కంపెనీలో ఆరు సంవత్సరాలు పని చేసి , ఉద్యోగంలో ఎన్నో విజయాలు సాధించాడు. అయినా కూడా అతనికి సంతృప్తి లేదు. దాంతో ఇండియాకి తిరిగి వచ్చి, ఇక అప్పటి నుండి అతని జీవితం అనూహ్య మలుపు తిరిగింది..తన జాబ్ వదిలేసి, 20 ఆవులు కొన్ని సొంత డైరీని ప్రారంభించాడు.ఇక ఈ సిద్ ఫార్మ్ ద్వారా మొత్తం ఆరు వేల మందికి పాలు సరఫరా చేస్తున్నారు. ఇతను కేవలం పాల వ్యాపారం మాత్రమే కాకుండా సేంద్రియ పాల ఉత్పత్తులైన పెరుగు , నెయ్యి కూడా విక్రయిస్తున్నాడు.. సిద్ ఫామ్ ద్వారా ఇప్పుడు రోజుకు దాదాపు 10 వేల మంది వీరి ఉత్పత్తులను వినియోగిస్తున్నారు.. మొత్తం ఈ డైరీ మీద కిషోర్ సంవత్సరానికి 44 కోట్ల రూపాయల లాభాన్ని ఆర్జిస్తున్నాడు.