కేంద్ర ప్రభుత్వం పేదల కోసం ప్రవేశపెట్టిన అటల్ పెన్షన్ యోజన కింద 18 సంవత్సరాల వయసులో ఉన్నవారు , వెయ్యి రూపాయల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ పొందడం కోసం ప్రతి నెల 42 రూపాయల నుంచి రూ .210 వరకు చెల్లించాల్సి ఉంటుంది. ఇక మీరు 60 సంవత్సరాల తర్వాత ఐదు వేల రూపాయలను పెన్షన్ కింద పొందాలి అనుకుంటే, నెలకు 210 రూపాయలు పెన్షన్ కట్టాలి. అంటే సంవత్సరానికి 2,500 రూపాయలు చెల్లిస్తే , రూ.60 వేల పెన్షన్ వస్తుంది. 40 ఏళ్ళ వయస్సులో ఉన్నవారు ప్రతి నెల నుంచి ఐదు వేల రూపాయల వరకు పెన్షన్ తీసుకోవడానికి నెలకు రూ. 291 నుంచి రూ. 1454 రూపాయల వరకు చెల్లించాల్సి వుంటుంది..