పోస్ట్ ఆఫీస్ ప్రవేశపెట్టిన కిసాన్ వికాస్ పత్ర మనీ స్కీం. ఇందులో ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే మీ డబ్బులు 124 నెలల్లో రెట్టింపు అవుతాయి. అందుకోసం మీరు వెయ్యి రూపాయల నుంచి కూడా ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇక గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు.ఉదాహరణకు మీరు లక్ష రూపాయలు పెడితే, రెండు లక్షలు తీసుకోవచ్చు. అదే రూ.నాలుగు లక్షలు పెడితే, రూ.ఎనిమిది లక్షలు పొందవచ్చు. ప్రస్తుతం ఈ కిసాన్ వికాస్ పత్ర స్కీమ్ మీద 6.9 శాతం వడ్డీ లభిస్తోంది.