పోస్ట్ ఆఫీస్ ప్రవేశ పెట్టిన గ్రామ్ ప్రియా స్కీమ్. ఈ స్కీం కాలవ్యవధి పది సంవత్సరాలు. రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ లలో ఇది కూడా ఒకటని చెప్పవచ్చు. అయితే ఈ స్కీమ్‌లో చేరడానికి వయోపరిమితి 20 సంవత్సరాల నుండి 45 సంవత్సరాల లోపు ఉండాలి. ఇందులో ప్రీమియంతో అధిక రాబడిని పొందవచ్చు.మీరు రూ.5 లక్షల బీమా మొత్తానికి పాలసీ తీసుకుంటే, నెలవారీ ప్రీమియం దాదాపు రూ.5 వేలు అవుతుంది. మీ చేతికి మొత్తంగా రూ.7.25 లక్షలు వస్తాయి.