ముఖ్యంగా నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ యోజన పథకం కింద ఒక్కో కుటుంబం రూ.5 లక్షల వరకు ప్రయోజనాన్ని పొందవచ్చు.పెద్ద పెద్ద హాస్పిటల్స్ లో సంవత్సరానికి రూ.ఐదు లక్షల వరకు ట్రీట్మెంట్ ఉచితంగా చేయించుకోవచ్చు . మీరు కూడా ఈ ఫెసిలిటీ పొందాలనుకుంటే ఒక్క రూపాయి కూడా చెల్లించాల్సిన పనిలేదు. ఉచితంగా ఈ పథకం యొక్క ప్రయోజనాలను పొందవచ్చు. ఇందుకోసం మీరు చేయవలసిందల్లా, మీకు దగ్గర్లో వున్న ప్రభుత్వ హాస్పిటల్స్ కి వెళ్లి సీఎంవో ను కలిస్తే సరిపోతుంది. ఒకవేళ మీకు తెలియకపోతే ఆరోగ్యమిత్ర ద్వారా కూడా మీరు ఆయుష్మాన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చు.