బుధవారం అనగా 2021 జూన్ 16వ తేదీన ఏర్పాటు చేసిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో, సబ్సిడీల పెంపకానికి ఆమోదం తెలిపింది.అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో డీ ఏ పీ బస్తా కూడా 2,400 రూపాయలకు చేరుకుంది.డీఏపీ ఎరువు పై ఇప్పటి వరకు కేవలం 500 రూపాయలు మాత్రమే సబ్సిడీ కింద ఇస్తుండగా, ఇప్పుడు తాజాగా 700 రూపాయల సబ్సిడీని అదనంగా పెంచింది. ఇప్పుడు అలా పెంచడంతో ఏకంగా 1200 రూపాయల సబ్సిడీ రైతులకు వర్తిస్తుంది.