ఇటీవల కాలంలో చాలామంది ఆన్లైన్ ఆఫర్లకు ఆకర్షితులై, ఎక్కువగా డబ్బును వృధా చేస్తున్నారు. ఇలాంటి సమయంలోనే 30 రోజుల నియమాన్ని పాటిస్తూ, ఒక వస్తువును కొనుగోలు చేయడానికి వాయిదా వేయండి. ఆ తర్వాత కూడా అవసరం అనిపిస్తే కొనుగోలు చేయండి. లేకపోతే ఆ వస్తువుకు సమానమైన డబ్బును ఆదా చేయవచ్చు.