ఈ ఎస్ ఐ సి స్కీం ద్వారా ప్రయోజనం పొందుతున్న అభ్యర్థులు ఇందుకు అర్హులు. ఇక ఈ స్కీం లో చేరిన వారు ఎవరైనా సరే కరోనా బారిన పడి చనిపోతే, ఇక అతని పై ఆధారపడిన భార్య లేదా తల్లిదండ్రులు లేదా పిల్లలకు ప్రతి నెల 1800 రూపాయలను ఇవ్వడం జరుగుతుంది. ఎంప్లాయిస్ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఇటీవల కొవిడ్-19 రిలీఫ్ పథకం కింద దీనిని చేర్చడం కూడా జరిగింది. ఎవరైతే ఈ ఎస్ ఐ సి కార్డ్ హోల్డర్ కరోనాతో మరణిస్తారో, ఈ డబ్బులు వారి కుటుంబానికి అందించడం జరుగుతుంది.